యావాటెంపుల్ బలిపీఠ గృహము(హోమగుండము) 10వ లైన్ వెనుక రాజీవ్ గాంధీనగర్ గుంటూరు. ఆంద్రప్రదేశ్,ఇండియా. భక్తులకు శుభములు,
క్రీ.పూ.1500 సంవత్సరాల నుండి యూదుల ఆధ్యాత్మిక చైతన్యం భారతదేశంలో అస్పష్టముగా కొనసాగింపబడుచున్నది, అది నేడు ప్రపంచ మానవాళికి శాంతి సమాథానాలను దైవజ్ఞానాన్ని అందించేందుకు, దైవ సంకల్పముతో యావాదేవుని పేరిట యావా టెంపుల్, బలిపీఠాన్ని గుంటూరు నగరంలో ది..19.02.2002 న శ్రీ బండారు దేవరాజు యావాటెంపుల్ ప్రధాయాజకులచే ఏర్పాటు చేయబడింది. అప్పటి నుండి సర్వాధికారి, సృష్టికర్త, ఉరుము మెరుపుల మహా ప్రభావముగల యావాదేవుని ఆశీర్వాదము అందించుచున్న ఏకైక మందిరముగా యావా టెంపుల్ గుర్తింపు కలిగిఉన్నది.
యూదా గోత్రికుడైన (యేసు) యషూవా మోషే ధర్మశాస్త్రం ప్రకారం, పరిశుద్ద యెరూషలేము పట్టణము నందుగల యావా ( టెంపుల్ ) హేకల్ను దర్శించి, బలిపీఠంపై ఏటేట బలి అర్పించుకొని, యావాదేవుని కృపను రెండంతల ఆత్మప్రభావాన్ని పొందారు. ఆయన మరణానంతరం 40 సం. ల వరకు అనగా క్రీ.శ. 70 వ సం. వరకు మోషే ధర్మశాస్త్రం ప్రకారం హోమార్పణలతో కూడిన బలిపీఠ కార్యక్రమములు తన ప్రభావాన్ని కనుపరచాయి. క్రీ.శ. 70 వ సం.లో యెరూషలేము మందిర విధ్వంసం తరువాత ప్రపంచంలో ఎక్కడా నిర్మింపబడని యావాటెంపుల్, బలి అర్పణల కార్యక్రమాలు బారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము, గుంటూరు జిల్లా, గుంటూరు నగరంలో పునరుద్దరింపబడుటకు దేవుని కృప లభించింది.
యావాటెంపుల్ ద్వారా దేవుడను గ్రహించే అమృత ఫలాలు 1. మనఃశాంతి: మనఃశాంతి పొందుటకు అమావాస్య, పౌర్ణమి విశ్రాంతి దిన సాయంత్రం 7 గం. నుండి 9 గం.ల వరకు యావాదేవుని సన్నిధిని కనపడి ఆయనను ఘనపరచి గొప్పమనఃశాంతిని పొందగలరు. 2. ఆధ్యాత్మిక సంతృప్తిః నిజమైన ఆధ్యాత్మిక సంతృప్తి పొందుటకు యావా టెంపుల్ నందు ప్రతి శుక్రవారం రాత్రివేళ జరిగే ఆరాధన కార్యక్రమములలో దైవోపదేశాలు విని నిజమైన దైవజ్ఞానముతో కూడిన ఆధ్యాత్మిక సంతృప్తిని పొందగలరు. 3. కుటుంభ సౌభాగ్యముః కుటుంబ సౌభాగ్యము కొరకు మీ కష్టార్జితమైన ప్రతీదీ దీవెనకరమై, మీ కుటుంబమంతటికి బలమును తేజస్సును అందించులాగున, మీ కానుకలను మ్రొక్కుబడులను స్వేచ్చార్పణలను యావాటెంపుల్ నందు సమర్పించుకొని ఆశ్చర్యకరమైన కుటుంబ సౌభాగ్యాన్ని పొందగలరు. 4. శాపాలనుండి విదుదల పొందుటకుః పితరుల దోషాలవలన, స్వయంకృతాపరాధాల వలన సంభవించే అభద్రత, చారిత్రక ఆధ్యాత్మిక మతి మరుపు, రోగాలు, అవిద్య, పేదరికము, బానిసత్వము మొదలైన శాపాలనుండి విదుదల పొందుటకు ప్రత్యేకమైన హోమార్పణలు అర్పించుకొని యావాదేవుని కృపకు, పాత్రులవ్వండి. 5. దేశాభివృధి కొరకుః ఋతువుల క్రమమైన ప్రకృతితోను పాడి పంటల ఫలముల సమృద్ధితోను, జ్ఞాన వివేచనలుగల బిడ్డలతోను, నీతి నిజాయితీలతో కూడిన సమాజం కొరకు ప్రత్యేకమైన హోమార్పణలు అర్పించుకొని యావాదేవుని కరుణా కటాక్షములతో దేశాభివృద్దిని బలోపేతం చేయగలరు. 6. శ్రేష్టమైన పంటల కొరకుః శ్రేష్టమైన పంటల కొరకు, మీ పొలములో నాటే విత్తనములలో కొన్నింటిని యావా దేవుని సన్నిధిని కనుపరచి చీడ పీడలు లేని పది రెట్లు పంటను పొందగలరు. 7. దేవుని జనాంగమని తెలుసుకొనుట కొరకు: మీరు ఆయా బాషలు మాట్లాడే ప్రాంతాలలో కలసి పోయిన దేవుని జనాంగమైన, ఇశ్రాయేలీయులని, మీ పితరుల గోత్రముతో సహా తెలుసుకొని మన పితరుల దేవుని ఘనపరచగలరు.
పైన తెలుపబడిన మేలులు పొందగోరిన ప్రతిఒక్కరు మీ పూర్ణహృదయంతో, గుంటూరులోని యావాటెంపుల్ని దర్శించి మీ అమూల్యమైన కానుకలు, స్వేచ్చార్పణలు, మ్రొక్కుబడులు, యావాదేవుని సన్నిధిని అర్పించుకొని యావాదేవుడు అనుగ్రహించిన దీవెనను ఘనపరచగలరు.
piller of the temple నాదేవుని ఆలయంలో (మందిరం) లో ఒక స్థంభం
piller of the temple నాదేవుని ఆలయం (మందిరం) లో ఒక స్థంభం గా చేస్తాను, అంటే ఏమిటి? అంత్యకాలంలో ఏర్పాటు చేయబడే, ఆరవ సంఘకాలంలో, నికోలాయితుల దుర్బోధను జయించిన వానిని, దేవుని ఆలయం (యావా టెంపుల్) లో ఒక స్థంభముగా ఉండే బహుమానం ఏర్పాటు చేయబడింది. బైబిలులోని ప్రకటన 1:1 ప్రకారం, యావా టెంపుల్ లో ఒక స్థంభము Piller of the Temple గా చేయబడే వాక్య మర్మాన్ని పరిశీలిస్తే: మన (ఇశ్రాయేలీయుల) పితరుల దేవుని చిత్త ప్రకారము, క్రీ.శ.30 లో యషూవా (యేసు) శిలువపై చనిపోయి సమాధి చేయబడ్డాడు. పునరుత్ధానదూత చేత యషూవా ఆత్మను పాతాళదూత వశము నుండి విడిపించి, పరలోకంలోని సర్వాదికారియైన యావాదేవుని సన్నిధికి చేర్చబడింది. క్రీ.శ, 50 సం. కాలంలో యావాదేవుని ఆజ్ఞ తీసుకొని, ఆయన సన్నిధినుండి బయలుదేరి వచ్చిన యషూవా ( యేసు) ఆత్మ, పత్మాసులో ఉన్న శిష్యుడైన యోహోనుకు దూత రూపంలో ప్రత్యక్షమైనాడు. తాను మరణించి పునరుత్ధానుడైన దినము మొదలుకొని లోకాంతం వరకు జరగనున్న కాలాన్ని ఏడు సంఘ కాలాలుగా విభజించి, ఆయా కాలాల్లో ఇశ్రాయేలీయుల పక్ష్యాన జరగబోవు విషయాలను యోహోనుకు తెలియజేశాడు. ఆ విషయాలే ప్రకటన గ్రంధముగా ముద్రించబడ్డాయి. ప్రకటన గ్రంధములో వ్రాయబడిన ఏడు ప్రాంతాలలో ఏడు సంఘాలు అనగా ఏడు యూదుల సమాజ మందిరాలు (సునగోగులు). వాటిలో ఉండే ఏడుగురు సంఘదూతలు, ఏడుగురు ఇశ్రాయేలీయులు. వారి విషయమై దేవుని ప్రణాళిక ఎలాఉంటుందో (యషూవా) ఆత్మ తెలియజేశాడు. ప్రకటన 3:7- 13 ప్రకారం ఆరవ సంఘకాలమైన ఫిలదెల్పియా సంఘకాలంలో జరుగనున్న విషయాలలో,, "జయించు వానిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసేదను. అందులోనుండి వాడు ఇక మీదట ఎన్నటికి వెలుపలికి పొడు" మరియు " నా దేవుని పేరును, పరలోకంలో నా దేవుని యొద్ద నుండి దిగి వచ్చుచున్న.నూతన యెరూషలేమను, నా దేవుని పట్టణపు పేరును నా క్రొత్త పేరును వాని మీద వ్రాసెదను. సంఘములతో ఆత్మ(యషూవా) చెప్పుచున్న మాట చెవిగల వాడు వినునుగాక అని తెలుపబడినది.
వాస్తవంగానే ఆరవ సంఘకాలం నాటి సంగతుల మర్మం. ఆ సంఘకాల దూత చేసేపనులు నేటి కాలంలో ఉనికి లోనికి వచ్చాయి. 1. 3:8, లో వ్రాయబడిన విషయాలను క్లుప్తంగా పరిశీలిస్తే; ఈ సంఘకాల దూత శక్తి కొంచమే. 2. తెలుగు బాషలో యావా అనే పదము, ఏవ, యేవ అనే వ్యసన పూరిత ప్రవర్తనను చూపే భావాలతో ఉపయోగింప బడుచున్నది. ఇటువంటి తెలుగు పదంతో దేవుని పేరు స్మరించడానికి కొందరు ఇష్టపడలేదు. కాని ఎవరూ ఇష్టపడక పోయినా, ఊరీము- తుమ్మీము ద్వారా మరుగున పడిన ఇశ్రాయేలీయుల దేవుని పేరు స్మరించ వచ్చని గుర్తించి, యావా (ఉన్నవాడు) అనే సర్వాధికారియైన యావాదేవుని పేరు ఎరుగననక ప్రచారములోనికి తీసుకురాబడింది. ప్రస్తుతము ఉరుము మెరుపుల మహోగ్రత పూరితుడైన దేవునిపేరైన, యావాఅనే పదాన్ని పలకటానికి అనేకులు భయపడుచున్నారు. గతంలో, తెలుగు బాషమాట్లాడే వారి మధ్యకు వచ్చిచేరిన, నశించిన ఇశ్రాయేలీయుల వలన యావాదేవుని ఘనమైన నామానికి అవమానము వచ్చింది. కనుకనే ఆ పదమునకు పరిశుద్దత ప్రభావము కలుగునట్లు, అనేక సం.ల తరువాత తెలుగు బాషనుండి యావాదేవుని పేరు స్మరించుటకు, ఆఖరుసారిగా భూజనులందరూ తమ పితరుల దేవుని పేరు జ్ఞాపకము చేసుకునే అవకాశం కలిగింది. 3. 3:9, యూదులు (ఇశ్రాయేలీయులు) మోషే ధర్మశాస్త్రం ఆచరించుటకు బదులుగా ఇతర మతధర్మాలను ఆచరిస్తూ దైవ శాపానికిగురై, అన్యులుగా దేవుని చేత ఎంచబడినామనే విషయం మరచి పోయారు. అన్యాచారాల వలన ఆత్మీయ మతిమరుపు వ్యాధికి గురై దైవ విరోధమైన మందిరాలలో సంతోషిస్తూ, తాము నిజమైన యూదులమని చెప్పు కొంటున్నారు. ఈలాంటి సాతాను సమాజము (సునగోగు) వారికి బుద్దిచెప్పించి, తమ పితరుల దేవుడైన యావా ఇంకనూ ఇశ్రాయేలీయుల (యూదుల)ను ప్రేమిస్తున్నాడని అనేక లేఖనాల నెరవేర్పు ద్వారా గ్రహించునట్లు చేస్తున్నాడు. ఇశ్రాయేలీయులలో అనేకులు వారి గోత్రాలతో సహ గుర్తింప బడుచూ, ఆత్మీయ మతిమరుపు నుండి విడుదల పొంది, తమ పితరుల దేవుని దయకు పాత్రులవు చున్నారు. 4. 3:10, ఆరవసంఘ కాలంలో నికోలాయితుల దుర్బోధను జయించు వానికి, పరలోక చాయా రూపకమైన యెరూషలేమను అదృశ్య మందిరంలో (యావాటెంపుల్) ఒక స్తంభముగా చేసేదను. అని తెలుపబడిన మాటల నెరవేర్పు కొరకు యావాటెంపుల్ ఏర్పాటుచేయబడింది. యావాటెంపుల్ ఉండాలంటే దేవుని పేరు బహిర్గతమవ్వాలి. ఆయన ప్రభావాన్ని కనుపరచే బలిపీఠము, హోమార్పణలు తప్పక ఉండాలి. అవి యావా టెంపుల్ కార్యక్రమాల ద్వారా దైవ సంకల్పముతో అనూహ్యంగా ఉనికిలోనికి వచ్చాయి. అందువలన ఆరవ సంఘకాలంలో దుర్బోధను జయించు వారికి యావా దేవుని టెంపుల్ లో ఒక స్థంభంగా ఉండే బహామానము అదృశ్యంగా ఇవ్వబడు చున్నదని తెలుపబడింది. 5. ఈ కాలంలో లోకమంతటికి వచ్చే శోధనకాలం త్సునామి అనే ఉప ద్రవముతో ప్రారంభమయింది. ఉపద్రవ ప్రభావము లోకాంతం వరకు తప్పక కొనసాగుతుంది.
అన్య దేశంలో, ఆరవ సంఘకాల దూత కాలము ముగిసిన వెంటనే, లవొదికైయా అనబడే ఏడవ సంఘకాలం, సంఘకాల దూత కార్యక్రమాలు ఇశ్రాయేలు దేశంలో అతి త్వరలో ప్రారంభం కానున్నాయి.
అందువలన, నా దేవుని మందిరములో ఒక స్థంభముగా ( Piller of the Temple ) చేసెదను అని యషూవా ఆత్మ తెలియ చేసిన అదృశ్య బహుమానం ఇశ్రాయేలీయులు పొందాలి. అందుకే యావాటెంపుల్ ( మందిర) కార్యక్రమాలు, పిలదెల్పియా సంఘకాల బహుమానాన్ని గూర్చిన మర్మం వెలుగులోనికి వచ్చింది.
ఆరవ సంఘకాల దీవెనను ప్రజలు అర్ధం చేసుకోవాలని " జయించు వానిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసేదను." అనే వాక్యము ద్వారా యావాటెంపుల్ యొక్క ముఖ్య ఉద్దేశ్యమును జ్ఞాపకార్ధముగా వ్రాయించడం జరిగింది.